ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు - ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పరిస్థితిపై చిదంబరం వ్యంగ్యం

ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ వెనుకబడిపోవడం పట్ల కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శనాత్మకంగా స్పందించారు. హార్యానాలో దెబ్బతిన్నారు, మహారాష్ట్రలో వద్దనిపించుకున్నారు, ఇప్పుడు ఝార్ఖండ్ లో ఓడిపోయారు అంటూ ఎద్దేవా చేశారు. ఇదీ ఈ ఏడాది బీజేపీ కథ. బీజేపీయేతర పక్షాలన్ని ఒక్కటవ్వాల్సిన తరుణం వచ్చేసింది. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇతర పార్టీలు కాంగ్రెస్ తో చేయి కలపాలి అని చిదంబరం ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం కూటమి బీజేపీపై ఆధిక్యత ప్రదర్శిస్తోంది. గత ఎన్నికల్లో 37 స్థానాలు గెలిచిన బీజేపీ ఈసారి పాతిక స్థానాల కోసం చచ్చీచెడీ ఎదురీదుతోంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post