హైదరాబాదులో సీసీఎస్ ఎస్సై సైదులు ఆత్మహత్య

హైదరాబాదులోని సీసీఎస్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సైదులు ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. విధి నిర్వహణలో ఎంతో సిన్సియర్ గా ఉండే సైదులు ఆత్మహత్యతో సీసీఎస్ కార్యాలయంలో విషాదం నెలకొంది. సైదులు మృతి పట్ల ఆయన సహచరులు దిగ్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post