అధికారులను కాల్చి చంపిన సీఆర్పీఎఫ్ జవాను

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చాలా నేరాలకు మద్యం మహమ్మారే ప్రధాన కారణం. మద్యం మత్తులో తాము ఏం చేస్తున్నామనే విషయాన్ని మరిచిన కొందరు ఇతరుల జీవితాలను ఛిద్రం చేయడమే కాకుండా, తమ జీవితాలను కూడా చీకట్లలోకి నెట్టుకుంటున్నారు. తాజాగా జార్ఖండ్ లో ఓ సీఆర్పీఎఫ్ జవాను మద్యం మత్తులో తన పై అధికారులను కాల్చిచంపాడు. ఛత్తీస్ ఘడ్ కు చెందిన సదరు జవాను ప్రస్తుతం జార్ఖండ్ ఎన్నికల సందర్భంగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఫుల్ గా మద్యం సేవించిన అతను సోమవారం తన పై అధికారులపై కాల్పులు జరపడంతో ఓ అసిస్టెంట్ కమాండెంట్, మరో అసిస్టెంట్ ఎస్సై చనిపోయారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన భద్రతా దళాలలో ఈ తరహా ఘటనలు ఇటీవల పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post