ఎన్కౌంటర్ కి పెరిగిన క్రేజ్ - శ్రీనివాసరెడ్డినీ చంపేయాలంటున్న హాజీపూర్ వాసులు

దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబీకులకు ఊరటనిచ్చి ఉండవచ్చు. అదే సమయంలో పలు బాధిత కుటుంబాల నుంచి ఇటువంటి డిమాండ్ రావడం మానవతావాదులను ఆశ్చర్యపరుస్తోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పని తెలిసినా బాధిత కుటుంబాలు దాన్నే ఒప్పుగా భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ కౌంటర్ జరిగిన వెంటనే అయేషా మీరా తల్లి, ఆ తర్వాత సినీనటి ప్రత్యూష తల్లి తమకు జరిగిన అన్యాయంపై న్యాయం ఎప్పటికని ప్రశ్నించారు. వరంగల్ లో పందొమ్మిదేళ్ల బాలికను పుట్టినరోజునాడే అత్యాచారం చేసి చంపేసిన ఘటనపై ఆమె తండ్రి కూడా నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని కోరారు. తాజాగా, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా కారాగారంలో ఉంటున్న శ్రీనివాసరెడ్డి పలువురు యువతులపై అత్యాచారం చేసి అనంతరం హత్యచేసినట్లు బయటపడడంతో యావద్దేశమే విస్తుపోయేలా చేసింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post