డీఆర్డీవో ఆకస్మిక తనిఖీలు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన వారికి చెల్లించే డబ్బులను ఆన్లైన్ పద్ధతిలో వారి యొక్క వ్యక్తిగత ఖాతాలకు చేయవలసిందిగా సిబ్బంది నీ ఆదేశించారు. ఐకెపి సెంటర్ పక్కనే స్మశాన వాటిక నిర్మాణ పనులను తొందరగా ప్రారంభించాలని క్షేత్ర సహాయకులు అనుమాండ్ల యాదగిరి కి సూచించారు గతంలో 10 లక్షలు ఉన్నటువంటి స్మశాన వాటిక ఇప్పుడు 11 లక్షలకు పెరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లో క్షేత్ర సహాయకులు హనుమాన్ ల యాదగిరి, సీసీ వసంత, సి ఏ పద్మ ,నాయకులు లింగంపల్లి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???

0/Post a Comment/Comments

Previous Post Next Post