మోడీ కన్ను తెలంగాణ పై పడింది - వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే విజయం : మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో బీజేపీ తెలంగాణ ఎంపీలు ఈ రోజు పార్లమెంట్‌ ప్రాంగణంలో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు, తెలంగాణ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, సోయం బాపురావు, అర్వింద్‌, బండి సంజయ్‌ తదితరులు మోదీని కలిసిన వారిలో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. కష్టపడి పని చేయాలని బీజేపీ నేతలకు సూచించారు. తెలంగాణలో పరిస్థితులను మోదీ అడిగి తెలుసుకున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు బీజేపీ ఎంపీలతో మోదీ మాట్లాడారు. కాగా, ఈ సందర్భంగా సమ్మక్క, సారలమ్మ ప్రసాదాన్ని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ప్రధాని మోదీకి ఇచ్చారు. అలాగే, కేంద్రం నుంచి పెండింగ్‌ నిధులపై కూడా తెలంగాణ ఎంపీలు ప్రధానితో మాట్లాడినట్లు తెలుస్తోంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post