తరచు ప్రమాదాలు జరుగుతున్న స్థలాలను పరిశీలించిన సీఐ మహేష్ గౌడ్

కరీంనగర్ జిల్లా: రాజీవ్ రహదారిపై వరుసగా జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు సిపి కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం గన్నేరువరం మండలం గుండ్లపల్లి ఎక్స్ రోడ్డును సీఐ మహేష్ గౌడ్ గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి తో కలిసి పరిశీలించారు తిమ్మాపూర్ సర్కిల్ పరిధిలో నుస్తులాపూర్ కొత్తపల్లి గుండ్లపల్లి స్టేజీ లను ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలుగా రోడ్ సేఫ్టీ కమిటీ నిర్ధారించి నెలలు గడుస్తున్నా సంబంధిత శాఖలు స్పందించలేదని స్థానికులు తెలిపారు అనంతరం టోల్ ప్లాజా ఇంచార్జ్ ను పిలిపించుకుని వెంటనే సూచించిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు వీటికి సంబంధించిన కారణాలను పోలీసు కమిషనర్ కు నివేదించనున్నట్లు మహేష్ గౌడ్ తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post