సుందరగిరి రైతులు ఆందోళన - కరీంనగర్ హుస్నాబాద్ రహదారిపై రాస్తారోకో

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. సింగిల్ విండో ఆద్వర్యంలో నిర్వహించిన కొనుగోల్లలో 40కిలోల ధాన్యం బస్తాకు నాలుగు కిలోల తరుగు తీయడం, హమాలి పేరిట 13 రూపాయల వసూలు చేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగర్ హుస్నాబాద్ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.గంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.విషయం తెలుసుకున్న ఎస్ఐ మధుకర్ రెడ్డి రాస్తారోకో వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడి శాంతింపజేశారు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని ఎస్సై హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post