అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామానికి చెందిన అక్కనపెల్లి వివేక్ కుటుంబానికి సంబంధించిన ఒక పెళ్లి కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన బూర్ల మహేష్ (23) అనుమానాస్పద స్థితిలో మరణించినట్టు స్థానిక ఎస్సై తిరుపతి తెలిపారు వివరాల్లోకి వెళితే గురువారం తన మిత్రుని పెళ్లికి హాజరైన మహేష్ పెళ్లి వేడుకల్లో సంబరాలు జరుపుకుంటున్న సమయంలో ఫోన్ కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళాడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో తన సోదరుడు వెళ్లి చూడగా మృతదేహమై పడి ఉండడంతో బంధువులకు ఈ విషయాలు తెలియజేశాడు విషయం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post