గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు ఘనంగ

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి శ్రీ రామకృష్ణ హై స్కూల్ లో ముందస్తు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా పాఠశాల విద్యార్థులు వివిధ గణిత అంశాలపైన అనేక నమూనాలను తయారుచేసి మ్యాథ్స్ ఫెయిర్ నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు గణితంలో వివిధ సమస్యల సాధనకు సులభమైన పరిష్కారాలు చూపించడానికి ఈ నమూనాలు ఉపయోగపడతాయని అన్నారు గణిత శాస్త్రంలో శ్రీనివాస రామానుజన్ చేసిన ప్రయోగాలను ఆయన కీర్తించారు ఈ మ్యాథ్స్ పేరుకు విద్యార్థులను ప్రోత్సహించిన గణిత ఉపాధ్యాయులు ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వడ్ల కొండ శ్రీనివాస్ సీనియర్ ఉపాధ్యాయురాలు ప్రజ్ఞశృతి గణిత ఉపాధ్యాయులు చంద్రశేఖర్,చంద్రమౌళి ,రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post