రేకొండలో సెంట్రల్ లైటింగ్ సిస్టంను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు పోటీ పడాలని హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని రేకొండ గ్రామంలో ఎమ్మెల్యే నిధుల నుండి 4లక్షల 60వెల రూపాయలతో ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్టం ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి,జడ్పీటీసీ గీకు రవీందర్, గ్రామ సర్పంచ్ పిట్టల రజిత శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు చాడ శోభ, కొత్తూరి సంధ్య రమేష్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రామోజు కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post