సంచలనం సృష్టించిన దిశ ఎన్‌కౌంటర్ - మృతదేహాలకు నేడు రీపోస్టుమార్టం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలకు నేడు రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో నిర్వహించనున్న ఈ పోస్టుమార్టానికి ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిపతి సుధీర్ గుప్తా నేతృత్వం వహిస్తారు. ముగ్గురు వైద్యుల బృందం ఈ ఉదయం 9 గంటలకు పోస్టుమార్టం చేయనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు జరగనున్న ఈ పోస్టుమార్టం అనంతరం నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఆ వెంటనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు బాధితుల కుటుంబ సభ్యులను ఒప్పించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post