పదిలో శత శాతమే లక్ష్యంగా ముందుకు గన్నేరువరం ప్రభుత్వ పాఠశాల

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండకేంద్రంలో పదో తరగతి లో విద్యార్థులు శత శాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కసరత్తు మొదలు పెట్టారు మెరుగైన ఫలితాల సాధనే లక్ష్యంగా విద్యార్థులను సాన పడుతున్నారు జిల్లా విద్యాశాఖ ఆదేశాలు సారం ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు గన్నేరువరం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం 32 మంది, తెలుగు మీడియం 10 మంది మొత్తం 42 మంది పదోతరగతి విద్యనభ్యసిస్తున్నారు వారికి ఉదయం 8 నుంచి 9 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఉత్తమ విద్యార్థుల గా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు విద్యార్థులకు పది పరీక్షలంటే భయం లేకుండా అవగాహన కల్పిస్తున్నారు అర్థం కానీ పాటలను మరలా బోధిస్తున్నారు చదువులో వెనుక బడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధ చూపుతున్నామని ప్రధానోపాధ్యాయులు కట్టా రవీంద్ర చారి ఈ సందర్భంగా తెలిపారు

పాఠాలు శ్రద్ధగా వింటున్నాం

విద్యార్థిని పేరు
మునిగంటి పూజిత

ఉపాధ్యాయులు మా సందేహాలను నీ వృత్తి చేస్తున్నారు వారు చెప్పే పాటలను శ్రద్ధతో వింటున్నాం ఉదయమే నిద్రలేచి పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాను పరీక్షల్లో పదికి పది పాయింట్లు తెచ్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను ట్రిపుల్ ఐటీలో సిటీ సాధించి తల్లిదండ్రులు పాఠశాలకు మంచి పేరు తీసుకువస్తాను

పోటాపోటీగా సన్నద్ధం

విద్యార్థిని పేరు
బోయిని అఖిల

రోజు వేకువ జామునే నిద్రలేచి చదువుకుంటున్నాను అర్థం కాని విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నాను తోటి మిత్రులతో కలిసి పోటీపోటీగా పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాను పదికి పది పాయింట్లు సాధించి ట్రిపుల్ ఐటి సాధించడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం …..

0/Post a Comment/Comments

Previous Post Next Post