మూడు రాజధానులపై పవన్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు రావొచ్చంటూ శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రతిపక్షం టీడీపీ విమర్శించిన విషయం తెలిసిందే. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ‘తినడానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట. అమరావతి రాజధానికే ఇప్పటిదాకా దిక్కూ దివాణం లేదు. మరి జగన్ రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అసలు అయ్యేనా? పాలకుల వల్ల రాష్ట్ర విభజన మొదలుకొని ఇప్పటిదాకా రాష్ట్ర ప్రజలకు అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఒరిగిందేమీ లేదు’ అని అన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post