ఆత్మహత్య చేసుకున్న రైతుకు నివాళులు అర్పించిన గడ్డం నాగరాజు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సాంబయ్య పల్లె లో గురువారం పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న కళ్లెం మల్లారెడ్డి పార్థివదేహం వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించిన దళిత మోర్చా రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి మానకొండూరు నియోజకవర్గం ఇంచార్జి గడ్డం నాగరాజు మరియు పార్టీ నాయకులు, అనంతరం గడ్డం నాగరాజు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి బిజెపి పార్టీలో చురుగ్గా పని చేసిన వ్యక్తి అని ఆయన గుర్తు చేసుకున్నారు తెలంగాణ ఉద్యమంలో ఆయనపై ఎన్ని కేసులు ఉన్నప్పటికీ వెనుకాడని నేతగా కొనియాడారు ఆయన సేవలను మర్చిపోలేనని అన్నారు మల్లారెడ్డి పార్థివదేహం వద్ద పార్టీ నాయకులు కన్నీటి వీడ్కోలు పలికారు గడ్డం నాగరాజు తో పాటు పార్టీ నాయకులు బిజెపి మండల అధ్యక్షుడు నగునూరి శంకర్, జాలి శ్రీనివాస్ రెడ్డి, మునిగంటి సత్తయ్య, తదితరులు ఉన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post