గన్నేరువరం: సీపీఐ జిల్లా కార్యదర్శి పొనుగంటి కేదారి విలేకరుల సమావేశం

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి పోనుగంటి కేదారి మాట్లాడుతూ రైతు ప్రభుత్వం రైతులను మరిచిపోయిందని లక్ష రూపాయలు రుణమాఫీ ఇంతవరకు లేదని ఆయన అన్నారు ఒక్కసారి మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని అలాగే రైతు బంధు డబ్బులు, కొంతమందికి పడగా మరికొంతమందికి డబ్బులు పడతలేదని అన్నారు భూ ప్రక్షాళన పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన మండిపడ్డారు ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో అవకతవకలు జరుగుతున్నాయని అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు తేది 23 సోమవారం రోజున కరీంనగర్ పట్టణంలో ఎక్సైజ్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఈ మద్యం వలనే మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని అత్యాచారం చేసిన వారిని వెంటనే శిక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కాంతల అంజిరెడ్డి, సహాయ కార్యదర్శి చొక్కళ్ళు శ్రీశైలం, సీనియర్ నాయకుడు బుర్ర అంజయ్య గౌడ్, బోయిని మల్లయ్య, కోన చిన్న లచ్చయ్య, తేల శ్రీనివాస్, బుర్ర మల్లయ్య.

0/Post a Comment/Comments

Previous Post Next Post