ఈ నెల 9, 10, 11 తేదీల్లో 2020-21 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సీఎండీ హెచ్.హరనాథరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో, 10న కడప జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో, 11న తిరుపతి ఎస్పీడీసీఎల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని పేర్కొన్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference