ఖాసీంపెట్ లో ఘనంగా సావిత్రిబాయి పూలే 189వ జయంతి వేడుకలు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపెట్ గ్రామంలో దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 189వ జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తూ దీపారాధన జరిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత డి.ఎస్.పి జిల్లా కో కన్వీనర్ మహేందర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సేవలు మరువలేనివని ఆమె జీవితాన్ని త్యాగం చేసి మనకు చదువు అందించారని ఆమె తీసుకొచ్చిన జ్ఞానాన్ని ప్రజలందరూ గుర్తించి ఆ మహనీయుల బాట లో ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో చుక్కన్న, సాగర్,చందు, మల్లేశం, వెంకటేష్, రాజు, సురేందర్, కృష్ణ, సంతోష్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post