నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ ఈ నెల 24కు వాయిదా

హైదరాబాద్‌లోని నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో నేటి విచారణ ముగిసింది. అనంతరం విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఈ విచారణకు జగన్ హాజరుకాలేదు. విజయసాయిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావుతో పాటు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా విచారణకు హాజరయ్యారు. వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది. గత శుక్రవారం సీఎం హోదాలో తొలిసారి సీబీఐ కోర్టుకు జగన్ హాజరయ్యారు. నేటి విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఆయన చేసుకున్న విన్నతిని కోర్టు అంగీకరించింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post