ఆంధ్రప్రదేశ్ : 3234 పోలీసు శాఖ ఉద్యోగాలు

ఈ చెక్ పోస్ట్ , మొబైల్ యూనిట్ లల్లో పనిచేయడానికి సుమారు 3234మంది సిబ్బంది అవసరం ఉంది అంటూ డీజీపీ హోంశాఖ ఆమోదానికి పంపింది. అనుమతులు రావడంతో వీటిని ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించడానికి సిద్దమతున్నారు. ఇదిలాఉంటే 3234మందిలో 1078 మంది రిగ్యులర్ పోలీసులు ఉంటారని మిగిలిన 2,156 పోస్టులని అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా తీసుకోవాని నిర్ణయం తీసుకుంది. ఈ 2,156 మందిని స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (SPO) గా పిలుస్తారు. వీరిని జిల్లాల వారీగా ఎంపిక చేసే భాద్యతలని జిల్లా పోలీస్ అధికారికి అప్పగించింది.ఎక్స్ సర్వీస్ మెన్, రిటైర్డ్ ఆర్మీ ,నేవీ, ప్రముఖ సెక్యూరిటీ లలో పనిచేస్తున్న అనుభవం గలవారిని నియమించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎవరూ అందుబాటులో లేని పక్షంలో ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసి తీసుకుంటారు. ఈ ఉద్యోగాలకి అప్ప్లై చేసేవాళ్ళు 65 ఏళ్ళ లోపు వారై ఉండాలి, ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు ప్రకటించారు. క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు ఈ ఉద్యోగాలకి అర్హులు కారని తెలిపింది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post