జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో 40 మందికి పైగా విద్యార్థులు, ప్రొఫెసర్లు పై దాడి

గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహించిన ఈ దాడిలో సుమారు 40 మందికి పైగా విద్యార్థులు, ప్రొఫెసర్లు గాయపడ్డారు. వారి తలలు పగిలిపోయాయి.  దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యూ)లో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలు పోలీసులను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. గుర్తు  తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి జెఎన్యూ క్యాంపస్ లోకి ప్రవేశించి.. విద్యార్థులు, ప్రొఫెసర్లపై రాడ్లతో దాడి చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికంతటికీ కారణం ఢిల్లీ పోలీసులు లేదా వారి అండదండలతో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.వారంతా ప్రస్తుతం ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి వెనుక భారతీయ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సుమారు వందమంది గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు, కర్చీఫ్ లు, టవళ్లు అడ్డు పెట్టుకుని క్యాంపస్ లో స్వైరవిహారం చేసిన విషయం తెలిసిందే.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post