నిబంధన 71 దెబ్బకు.. సీఎం జగన్, మంత్రులకు కుడితిలో పడ్డ ఎలుకలా అయింది:టీడీపీ నేత దేవినేని ఉమ

శాసన మండలిలో వైసీపీ మంత్రుల వైఖరిపై టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. 14 మంది మంత్రులు వీధి రౌడీల్లా ప్రవర్తించారని విమర్శించారు. నిబంధన 71 దెబ్బకు సీఎం జగన్, మంత్రులు విలవిల్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా అయిందన్నారు.  ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకోవడం ద్వారా జగన్ కు టీడీపీ సభ్యులు కర్రు కాల్చి వాత పెట్టారన్నారు.  కుర్రచేష్టలతో విర్రవీగుతున్న బుర్రలేని మంత్రులకు తన 40 ఏళ్ల అనుభవం ఎలా ఉంటుందో చంద్రబాబు చూపించారని దేవినేని ఉమ అన్నారు. విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డికి మండలిలో ఏం పని? అని దేవినేని ఉమా ప్రశ్నించారు. 23వ తేదీకల్లా సీఎం జగన్ కు మూడు రాజధానుల ముచ్చట తీరిపోతుందని పేర్కొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post