కళ్యాణ్ రామ్ " ఎంత మంచివాడవురా " ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 8న

ఎంత మంచివాడవురా అనే సినిమాని ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సతీష్ విగ్నేశ దర్శకత్వంలో  చేస్తున్నాడు.  ఇక ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ఈ నెల 8న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనుంది.  పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మేహరీన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ ఈవెంట్ కి కళ్యాణ్ రామ్ సోదరుడు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా రానున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఈవెంట్ ని జేఆర్‌సీ కన్వెషన్ సెంటర్‌లో జరపనున్నారు. పక్కా ఫ్యామిలీ సినిమా కావడంతో సినిమాపైన మంచి అంచనాలను క్రియేట్ అయ్యాయి. దానికి తోడు ఈ సినిమా ఈవెంట్ కి ఎన్టీఆర్ వస్తుండడంతో మరింత క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post