ఎఐటియుసి జనవరి 8న జరిగే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె

ఎఐటియుసి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్‌.టి వంటి విధానాలతో దేశ ఆర్ధికాభివృద్ధి కుంటుబడిందని, ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎన్‌ఆర్‌సి, సిఎఎ పేరుతో విధ్వంసంసృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. బ్యాంకుల విలీనంతో పెద్ద పెద్ద కార్పొరేట్లకు సులభంగా బ్యాంకు రుణాలు అందించేందుకు మోడీ చుర్యలు తీసుకున్నారన్నారు. ఈ విధానాలకు నిరసనగా జనవరి 8న జరిగే సమ్మెలో కార్మికులు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ముజఫర్‌ అహమ్మద్‌, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య, సిఐటియు గుంటూరు తూర్పు, పశ్చిమ జిల్లాల ప్రధాన కార్యదర్శులు కాకుమాను నాగేశ్వరరావు, గుంటూరు విజయకుమార్‌, ఎఐటియుసి జిల్లా ప్రధానకార్యదర్శి కాసా రాంబాబు, ఎల్‌ఐసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు వివికె సురేష్‌, ఆర్‌టిసి రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి కె.గంగాధరరావు, సిఐటియు నగర తూర్పు, పశ్చిమ కమిటి అధ్యక్షు, కార్యద్శులు కట్లగుంట శ్రీనివాసరావు, బి.ముత్యాలరావు పాల్గొన్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post