ఘనంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ వేడుక
 సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. రొక్కం సుదర్శన రావు గారు మాట్లాడుతూ  నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ విశ్వవిద్యాలయ అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో కూడా మరెన్నో విశ్వవిద్యాలయ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే విధంగా అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాని తెలియపరిచారు.అదేవిధంగా విశ్వవిద్యాలయ కాంట్రాక్టు ఉద్యోగుల అసోసియేషన్ వారు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఉపకులపతి చేతులమీదుగా ఆవిష్కరించి ఉద్యోగులకు అందరికి క్యాలెండర్ ను అందచేశారు, త్వరలోనే కాంట్రాక్టు మరియు ఔట్ సౌర్చింగ్ సిబ్బందికి కూడా మేలు జరుగుతుందని తెలియజేసారు.
భోదన భోదనేతర సిబ్బంది ఎల్లవేళలా తమ వంతు సహాయ సహకారాలను అందచేస్తున్నారని పేర్కొన్నారు. అందరికి మరొక్క సారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో భోదన, భోదనేతర సిబ్బందికి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post