గన్నేరువరం మండల కేంద్రంలోని శ్రీ సమ్మక్క-సారలమ్మకు జాతరకు ఏర్పాట్లు చేస్తున్న కమిటీ సభ్యులు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభం కానున్న సందర్భంగా శ్రీ సమ్మక్క సారలమ్మ కమిటీ సభ్యులు శుక్రవారం ముమ్మరంగా పనులను ప్రారంభించారు ఈ జాతరకు నలుమూలల నుండి రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని కమిటీ సభ్యులు తెలిపారు జాతర ఆవరణములో లైటింగ్ మంచినీటి పరిశుద్ధ పనులు జరుగుతున్నాయి జాతర నుండి గ్రామం వరకు లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు ఈకార్యక్రమంలో సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ అధ్యక్షులు బోయిని మల్లయ్య, ఉపాధ్యక్షులు బోయిని పోశెట్టి, ప్రధాన కార్యదర్శి బుర్ర అంజయ్య గౌడ్, సహాయ కార్యదర్శి గూడూరి రాజయ్య, కోశాధికారి బొడ్డు భూపతి, కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post