పల్లె ప్రగతి రెండో విడతలో గుండ్లపల్లి-గునుకుల కొండాపూర్-జంగపల్లి గ్రామాల్లో పనులను పరిశీలించిన విష్ణువర్ధన్

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గ్రామంలో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను జిల్లా పర్యవేక్షణలో విష్ణువర్ధన్ బుధవారం మండలంలోని గుండ్లపల్లి గునుకుల కొండాపూర్ జంగపల్లి గ్రామలను పరిశీలించారు గుండ్లపల్లి లోని వన నర్సరీ స్మశాన వాటిక డంపింగ్ యార్డ్ పనులను హరితహారం మొక్కలకు గుంతలను సానిటేషన్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి లో చేపట్టిన పనులను సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటేశం ఎంపీడీవో సురేందర్ రెడ్డి ఎంపీడీవో నరసింహ రెడ్డి సర్పంచ్లు బేతేల్లి సమత రాజేందర్ రెడ్డి, లింగంపల్లి జ్యోతి బాలరాజు, అట్టికం శారద శ్రీనివాస్ గౌడ్, క్షేత్ర సహాయకుడు అనుమాండ్ల యాదగిరి కార్యదర్శులు అశ్విని అబ్దుల్ వాహెజ్ తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post