సీఆర్పీఎఫ్ క్యాంపుపై టెర్రరిస్టులు దాడి

గతేడాది ఆగస్టులో జమ్మూకాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిననాటి నుంచి అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత ఐదు నెలల్లో పలు మార్లు టెర్రరిస్టులు దాడులకు యత్నించడం, వాటిని సెక్యూరిటీ బలగాలు తిప్పికొట్టం జరిగింది. దాడికి పాల్పడిన ముష్కరుల కోసం గాలిస్తున్నామని, ప్రస్తుతానికి పరిస్థితి అంతా కంట్రోల్ లో ఉందని అధికారులు చెప్పారు.జమ్మూకాశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే పుల్వామా మరోసారి వణికిపోయింది. జిల్లాలోని నేవా గ్రామంలోగల సీఆర్పీఎఫ్ క్యాంపుపై టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అసలే టెన్షన్ వాతావరణం కొనసాగుతుండగా, సడెన్ గా దాడి జరగడంతో అధికారులు అలర్టయ్యారు. దాడికి సంబంధించి వారు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. పుల్వామా జిల్లాలోని నేవాలో సీఆర్పీఎఫ్ క్యాంప్ ను ధ్వంసం చేయడమే టార్గెట్ గా ముష్కర మూకలు ప్రయత్నించాయని, క్యాంప్ బయట బంకర్ లో గస్తీకాస్తోన్న జవాన్లపైకి పెట్రోల్ బాంబులతో దాడి చేశారని అధికారులు తెలిపారు. లక్కీగా జవాన్లెవరికీ పెద్ద గాయాలు కాలేదని, దాడి తీవ్రత కూడా తక్కువస్థాయిలోనే ఉందని చెప్పారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post