పవన్ సినిమాలో కొత్త మలుపులు , సినిమా వాయిదా

బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ తెలుగులో వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, బోనికపూర్‌లు నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పవర్‌స్టార్ పవర్‌కళ్యాణ్ ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.  ఇక ఈ సినిమా షూటింగ్‌కి పవన్ కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారట. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హీటు బాగా ఉండడంతో… తన సినిమాకి సంబంధించిన సమాచారం. ఏవీ బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే సినిమావాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువన్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపధ్యంలో జనవరి 20న మంచిరోజు కావడంతో పింక్ రీమేక్ కోసం పవన్ ఓ రోజు వచ్చి షూటింగ్ చేసి వెళ్ళి, అదే రోజు మళ్ళీ సాయంత్రం అమరావతిలోనే కనిపించాడు. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా పింక్ రీమేక్ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు రానే వచ్చేశాయి.
అయితే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో పవన్ షూటింగ్‌కి వెళ్ళడం ఏమిటని కొందరు అప్పుడే సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలెట్టేశారట. ఇక ఈ విషయం పైనే పవన్ కూడా దిల్ రాజ్‌పై కాస్త సీరియస్ అయ్యారట. ఇప్పటి నుంచి అయినా షూటింగ్‌కి సంబంధించిన వివరాలను కాస్త జాగ్రత్తగా ఉంచాలని ఎట్టిపరిస్థితుల్లో కూడా విషయం బయటకు రాకూడదన్నారని సమాచారం.2018లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసిలో కనిపించిన పవన్ ఆ తరువాత పూర్తి స్థాయి రాజకీయాలలోకి వెళ్ళిపోయారు. తిరిగి మళ్ళీ పింక్ చిత్రం బావుందని తెలియడంతో తిరిగి ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post