అమెరికా ఎంబస్సి సమీపంలో మూడు రాకెట్లు ఢీ

సెంట్రల్‌ బాగ్దాద్‌లోని గ్రీన్‌ జోన్‌లో ప్రభుత్వ, దౌత్య కార్యాలయాలు కొలువుతీరిన ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని హై సెక్యూరిటీ గ్రీన్‌ జోన్‌లో అమెరికా ఎంబస్సి సమీపంలో మూడు రాకెట్లు ఢీ కొన్నాయని భద్రతా వర్గాలు వెల్లడించాయి.  ఇరాన్‌ సైనిక కమాండర్‌ జనరల్‌ ఖాసి సులేమానిని అమెరికన్‌ దళాలు ఇరాక్‌లో హతమార్చిన క్రమంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ పరిణామం ఆందోళన రేకెత్తిస్తోంది. సులేమాని మృతితో అమెరికా, ఇరాన్‌ల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. కాగా రాకెట్‌ దాడిలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post