హైదరాబాద్ ప్రజలకు శుభవార్త ...!

హైదరాబాద్ నగరం ఎటు చుసిన రద్దీ గ ఉంటుంది . సొంత వాహనంలో ప్రయాణం చేసే వాళ్లకు చుక్కలే ఎక్కడ చుసిన రద్దీ , పలు చోట్ల అసలు పార్కింగ్ సదుపాయం ఏ లేదు . ఈ తప్పిదం GHMC ముందుచూపు లేనందు వల్లే వచ్చింది . కానీ ఈసారి మాత్రం వారు మంచి ఆలోచనే చేస్తున్నారు. హైదరాబాద్: ప్రైవేటు స్థలాల్లో బహుళ అంతస్తుల పార్కింగ్‌ కాంప్లెక్స్‌లను అభివృద్ధి చేయాలని జీహెచ్‌ఎంసీ సంకల్పించింది. నగరంలోని 100 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కువైట్‌కు చెందిన ప్రముఖ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణ సంస్థ కేజీఎల్‌ ఏజెన్సీ సహకారంతో దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. నానాటికీ జటిలమవుతున్న పార్కింగ్‌ సమస్య పరిష్కారానికి బహుళ అంతస్తుల పార్కింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణమే పరిష్కారమని జీహెచ్‌ఎంసీ నిర్ణయానికొచ్చింది. ఇందులో భాగంగా వివిధ నగరాల్లో అమలవుతున్న ఈ తరహా పార్కింగ్‌ కాంప్లెక్స్‌లపై అధ్యయనం నిర్వహించడంతోపాటు వీటి ఏర్పాటుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం గల ప్రఖ్యాత ఏజెన్సీలను ఎంపానల్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దీనికోసం ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు ఆహ్వానించి ఆయా ఏజెన్సీలను ఎంపిక చేస్తారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన నియమ నిబంధనలు రూపొందిస్తారు. ఆయా ఏజెన్సీలు స్థలాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపే ప్రైవేటు యజమానులతో ఏజెన్సీలు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశంపై శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post