జేఎన్‌యూలో హింసకాండ కారకులపై మండిపడుతున్న పలువురు ప్రముఖులు

ఢిల్లీ జేఎన్‌యూలో హింసకు కారణం వీసీ జగదీశ్‌ కుమారేనని వర్సిటీ విద్యార్థులు మండిపడుతున్నారు. ఆయన గూండాలా ప్రవర్తిస్తూ విద్యార్థులను హింసకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, కశ్మీర్ తదితర ప్రాంతాల్లోనూ విద్యార్థులు ఆందోళన చేశారు. జేఎన్‌యూ హింసాకాండపై అయిషీ ఘోష్ తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో అస్థిర పరిస్థితి నెలకొందని అభిప్రాయపడ్డారు. ఈ రోజు తన కుమార్తెను కొట్టారని.. రేపు తనపై కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ గూండాలే దాడి చేశారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్ పేర్కొన్నారు .SFI, AISA, PDSU తదితర విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. JNU హింసాకాండకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. జేఎన్‌యూ టీచర్స్‌ అసోసియేషన్‌ కూడా.. వీసీ జగదీశ్‌ కుమార్‌ తొలగింపునకు డిమాండ్‌ చేస్తూ రాష్ట్రపతికి లేఖ రాసింది 


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post