మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

అమరావతి: మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం. ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజధాని ప్రాంతానికి వెళతారన్న సమాచారంతో పోలీసులు పార్టీ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న వేళ జనసేన ముఖ్య నేతలతో పవన్‌ కల్యాణ్‌ మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. 
33 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా ముందుకు వెళుతుండడంపై మండిపడ్డారు. సమావేశం అనంతరం రాజధాని గ్రామాల్లో పర్యటించాలని ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతాన్ని సందర్శిస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందని భావించి పోలీసులు పార్టీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. ఆయనను పార్టీ కార్యాలయం వద్దే అడ్డుకోవాలని చూస్తున్నారు. మరోవైపు పార్టీ సమావేశం అనంతరం పవన్‌ కల్యాణ్‌ రాత్రి 8 గంటలకు మీడియాతో మాట్లడతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post