ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం : త్సార గంజ్ పారిశ్రామిక ప్రాం తంలో ఘటన

ఢిల్లీలో అగ్ని ప్రమాదాలు ఆగట్లేదు . ఇది అధికారుల  నిర్లక్ష్యంమా లేదా జనాల దురదృష్టమా తెలీట్లేదు. వివరాలలోకి వెళ్తే నెల రోజుఅ వ్యవధిలో నాలుగో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారు జామున ఉత్తర ఢిల్లీలోని పత్సార గంజ్ పారిశ్రామిక ప్రాం తంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడ ఉన్న ఓ ప్రింటింగ్ ప్రెస్ అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల ఒకటో తేదీన పీరాగి ప్రాంతంలోని ఓ బ్యాటరీ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అంతకుముందు డిసెంబరు నెలలో రెండు ఘోర ప్రమాదాలు జరిగాయి. అనాజ్ మండీలోని ప్లాస్టిక్ వస్తువులు తయారుచేసే ఓ బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ప్రమాదంలో 43 మంది చనిపోయారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post