త్వరలోనే హైదరాబాద్ కి మళ్లీ వస్తా: భీమ్ ఆర్మీ చీఫ్

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొనడానికి వచ్చిన  భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆయనను విమానం ఎక్కించి ఢిల్లీకి పంపించారు. తెలంగాణలో నియంతృత్వ పాలన తారస్థాయికి చేరుకుందని ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సీఎంవో ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. ప్రజల నిరసన హక్కులను ప్రభుత్వం, పోలీసులు కొల్లగొడుతున్నారని అన్నారు. మొదట తమ మద్దతుదారులపై దాడి చేసి, అనంతరం తనను కూడా అరెస్టు చేశారని చెప్పారు. తనను బలవంతంగా హైదరాబాద్‌ విమానాశ్రయానికి తీసుకొచ్చి ఢిల్లీ పంపిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని, ఈ అవమానాన్ని బహుజన్‌ సమాజ్‌ ఎప్పటికీ మర్చిపోదని, త్వరలోనే  మళ్లీ తిరిగొస్తానని అన్నారు .

0/Post a Comment/Comments

Previous Post Next Post