సరైన రహదారి కూడా లేని గ్రామంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల ప్రాంతం టేకులపల్లి మండలం చింతోనిచెల్క గ్రామపంచాయతీ లోని వొజ్జోని గూడెం గ్రామంలో ఆకస్మికంగా సందర్శించి 2వ విడత పల్లెప్రగతి పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ రజత కుమార్ శైనీ. అనంతరంజరుగుతున్న కార్యక్రమాల అభివృద్ధి పనుల గురించి గ్రామ ప్రజల సమక్షంలో సంబంధితిత అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, ఈ నెల 12వ తే దీ వరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. తర్వాత స్మశాన వాటిక డంపింగ్ యార్డ్ పనుల పరిశీలన నిమిత్తం రహదారి కూడలేని రామచంద్రుని పేట గ్రామానికి ముర్రేడు అనే వాగు దాటి మరి వెళ్లి పరిశీలించిన కలక్టర్. ఈ కార్యక్రమంలో జి పి ప్రత్యేక అధికారి ఏపీఎం వినోద్ క్రాంతి , కార్యదర్శి దీప్తి, ఫీల్డ్ అసిస్టెంట్ సరిత, పంచాయతీ సహాయకులు మహేష్, వీరస్వామి పాల్గొన్నారు.

Previous Post Next Post