మూడో వన్డేలో రెండు జట్లూ నువ్వా నేనా అంటున్న ఇరు జట్లు

2012 నుంచి టీమిండియా… మూడు వన్డేల సిరీస్‌లను గెలుస్తూ… ట్రాక్ రికార్డ్ కొనసాగిస్తోంది.  ఈ సారి సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను కంగారూలు రూల్ చేస్తే… రెండో మ్యాచ్‌లో టీమిండియా ఇరగదీసింది. ఇప్పుడీ మూడో వన్డేలో రెండు జట్లూ నువ్వా నేనా అన్నట్లు ఉన్నాయి. కొద్దిగా టీమిండియా అనుకూల పరిస్థితులు ఉన్నా… ఆసీస్ కూడా సమరానికి సై అంటోంది. ఐతే… 
ఇవాళ బెంగళూరులోని… చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌పైనే అందరి దృష్టీ ఉంది. ఆల్రెడీ సంక్రాంతి సందడి, కోడి పందేలు, సినిమాల జోష్ అయిపోవడంతో… ఇక అందరూ… మ్యాచ్ సంగతేంటా అని చూస్తున్నారు. గతేడాది భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో 3-2తో సిరీస్‌ ఓడింది. ఇప్పుడు మాత్రం విజయంపై ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉంది. బౌలర్లు కూడా కాస్త ఫామ్‌లోకి రావడం కోహ్లీ అండ్ కోకి కలిసొచ్చే అంశం. ఫ్యాన్స్‌కి ప్లస్ పాయింట్ ఏంటంటే… చిన్నస్వామి స్టేడియం పరుగులకు కేరాఫ్ అడ్రెస్. అందువల్ల ఫుల్ ఎంజాయ్‌మెంట్ గ్యారెంటీ. దానికి తోడు వాతావరణం కూడా అదిరిపోయింది. మేఘాలు మాత్రమే ఉంటాయి. నో రెయిన్.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post