మూడు రాజధానులు విధానం అసలు పనికి రాదు : చంద్ర బాబు

మూడు రాజధానులు ఎక్కడా విజయవంతం కాలేదని చంద్రబాబు అన్నారు. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వల్లే భూముల ధరలు పెరుగుతాయని, తద్వారా ఆదాయం వస్తుందని చెప్పారు. అమరావతి బాండ్లకు వెళితే రూ.2 వేల కోట్లు వచ్చాయన్నారు. రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలని, విశాఖలో రాజధాని పెట్టడంవల్ల రాయలసీమ జిల్లాలకు దూరమవుతుందని, ఆ జిల్లాల ప్రజలు 1,100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజధానులు, ప్రభుత్వ కార్యాలయాల వల్ల అభివృద్ధి జరగదని, ప్రజలు కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ చేయవద్దని, అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో చర్చకు పెట్టిన మూడు రాజధానులు, ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి బోర్డుల బిల్లుపై చర్చలో గంటన్నరసేపు మాట్లాడిన టీడీపీ అధినేత అమరావతిని సమర్థించుకునేందుకు అధిక ప్రాధాన్యమిచ్చారు
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post