ఖమ్మంలో అభివృద్ధి కోసం పర్యటించనున్న సీఎం కెసిఆర్

 ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెలలో భద్రాద్రి జిల్లాలో పర్యటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంను జిల్లాకు తీసుకొచ్చేలా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారు అయినట్లేనని రేగా తెలిపారు. . ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్‌ కెనాల్‌ కింద 80 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం ఏన్కూర్‌ వద్ద ఒక లింక్‌ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో నాగార్జునసాగర్‌ ద్వారా సాగునీటి సరఫరాలో ఇబ్బంది వచ్చినా ఆయకట్టుకు ఎలాంటి సమస్య లేకుండా సీతారామతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి 372 కిలోమీటర్ల పొడవున కాలువ నిర్మించనున్నారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టుకు సంబంధించి బీజీకొత్తూరు వద్ద ఫేస్‌-1 పనులను ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకే. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 6.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ ఎత్తిపోతల పథకాన్ని రూ.13,884కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ఆయకట్టును 9.36 లక్షల ఎకరాలకు పెంచాలని సైతం ప్రభుత్వం నిర్ణయించింది
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post