సమత 'హత్యాచారం' దోషులకు ఉరిశిక్ష.. సంచలన తీర్పు

కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగిన సమత హత్యాచారం కేసులో తీర్పు వెల్లడైంది. ముగ్గురు దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. న్యాయమూర్తి ఉరిశిక్షను ఖరారు చేయగానే దోషులు షేక్ బాబు, షాబుద్దీన్, ముగ్దుమ్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. మీరు చేసిన పని చాలా ఘోరమైనదని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.గతేడాది నవంబర్ 24న కొమురంభీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో సమత అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు అమ్ముకునే ఆమెపై ముగ్గురు మృగాళ్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. దారుణంగా హత్యాచారం చేయడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post