పాక్ లో తీవ్ర ఆహార సంక్షోభం

సమయానికి గోధుమల కొనుగోళ్లు చేపట్టకోవడం వల్లే పిండికి కొరత ఏర్పడిందని ప్రభుత్వం భావిస్తోంది. గోధుమలు, పిండి కొరత సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి లియాకత్ శాహ్వానీ చెప్పారు.
సింధ్ ప్రావిన్సు రాజధాని కరాచీలోనూ పిండి ధరలు పెరగడం వల్ల జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఎడారి ప్రాంతమైన థార్‌లో సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ గోధుమలు పండవు. థార్ ప్రాంతంలోని ముఖ్య పట్టణం మూథీలో కిలో పిండిని రూ.55కు అమ్ముతున్నారు. నంగర్‌హార్‌తోపాటు సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో కిలో పిండి ధర రూ.70 నుంచి రూ.80 వరకూ ఉంది. థార్ ఎడారి ప్రాంతంలో కొన్నేళ్లుగా కరవు సమస్య ఉంది. ఇక్కడ పోషకాహార లోపంతో నవజాత శిశువులు మరణిస్తున్న వార్తలు తరచుగా వస్తుంటాయి.
గత ఏడాది ఇక్కడ వర్షాలు పడ్డాయి. దీంతో కొంతమేర జొన్నలు సాగు చేశారు. కానీ, మిడతల దాడులు, అకాల వర్షాలు, పెనుగాలుల వల్ల ఆ పంటలకు నష్టం జరిగింది.
ఖైబర్ పఖ్తుంఖ్వాలో కొరతను తీర్చేందుకు సహృద్భావ చర్యగా రోజూ 5 వేల టన్నుల పిండిని పంపాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post