ఇరాక్,ఇరాన్ లో ఆగని క్షిపణి దాడులు

ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని అంతర్జాతీయ విమానశ్రయంపై రాకెట్ దాడి జరిగింది. ఈరోజు వేకువజామున రాకెట్ దాడి జరగగా ఈ దాడిలో ఇరాక్, ఇరాన్ కు చెందిన ఎనిమిది మంది ఉన్నతస్థాయి కమాండర్లు మృతి చెందారు. ఇరాక్ మీడియా వర్గాలు ఈ దాడిలో ఇరాన్ నిఘా విభాగం ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్ కూడా ప్రాణాలు విడిచినట్టు చెబుతున్నారు. ఇరాక్ లో ఇరాన్ మద్దతు ఉన్న తిరుగుబాటు సంస్థ పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ డిప్యూటీ కమాండర్ అబ్ మహదీ అల్ మహందీన్ కూడా మృతి చెందారు. రెండు కార్లు ఈ దాడిలో పూర్తిగా దగ్ధమయ్యాయని సమాచారం. ఇరాక్ భద్రతా వర్గాలు విమానశ్రయ కార్గో హాల్ ను మొత్తం మూడు రాకెట్లు ఢీకొట్టినట్లు చెబుతున్నాయి. ఈ దాడి ఎవరు చేశారనే దానిపై ఇంకా అధికారికంగా సమాచారం లభించలేదు. ఈ దాడికి పాల్పడింది అమెరికా బలగాలే అని ఇరాక్ పీఎంఎఫ్‌ ప్రతినిధి అహ్మద్ అల్ అస్సాది ఆరోపణలు చేశారు. 
ఇరాన్ తో శాంతినే కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతిని ఉద్దేశించి వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో అత్యంత పటిష్ఠమైన భద్రత, యూఎస్ తదితర దేశాల ఎంబసీలు ఉన్న గ్రీన్ జోన్ పై రెండు రాకెట్లను ఇరాన్ ప్రయోగించడం తీవ్ర కలకలాన్ని రేపింది. అర్థరాత్రి తరువాత ఈ ఘటన జరిగిందని వార్తా సంస్థ ఏఎఫ్పీ ప్రకటించింది. గ్రీన్ జోన్ లో భారీ శబ్దాలు వినిపించాయని, ఇరాక్ లోని సంకీర్ణ దళాల సైనిక స్థావరాలపై మిసైల్ దాడులు జరిగిన 24 గంటల తరువాత తాజా దాడి జరిగిందని పేర్కొంది. తాజా దాడులు కూడా సులేమానీ హత్యకు ప్రతీకారంగా జరిగినవేనని సమాచారం. ఈ ఘటనతో ఇరాక్ లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post