సీఏఏకు వ్యతిరేకంగా నేడు పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలో తీర్మానం!

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన పంతం నెగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. తొలి నుంచి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న దీదీ అసెంబ్లీలో నేడు సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నామని, దీనికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆ రాష్ట్ర మంత్రి పి.చటర్జీ కోరారు. సీఏఏ చట్టానికి పార్లమెంటు ఆమోద ముద్రవేసినప్పటి నుంచి దాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని గట్టిగా చెబుతున్న మమత ఆ మాటకే కట్టుబడి ఉన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post