ఖాసీంపెట్ లో ప్రారంభమైన పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమం

 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపెట్ గ్రామంలో పల్లె ప్రగతి రెండో విడత కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని గురువారం గ్రామ సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న ప్రారంభించారు గ్రామంలో తెలంగాణ పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమాన్ని గ్రామస్తులంతా కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం గన్నేరువరం ఎంపీడీవో సురేందర్ రెడ్డి పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని గ్రామంలో ఇరు వైపుల మొక్కల చుట్టూ టీ గార్డులను ఏర్పాటు చేయాలని ఎంపీడీవో సురేందర్ రెడ్డి అన్నారు ఫస్ట్ విడత లో కాసింపేట గ్రామం మండలంలో ముందంజలో ఉందని ఆయన అన్నారు సర్పంచిని అభినందిస్తూ రెండో విడతలో కూడా గ్రామం అభివృద్ధిలో ముందుండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏలేటి చంద్రారెడ్డి,గ్రామ ప్రజలు,వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post