బ్రిటన్‌ మహారాణి ఆస్థాన న్యాయవాది పదవిని పొందిన భారతీయుడు

ఇంగ్లాండ్‌, వేల్స్‌ కోర్టులకు క్వీన్స్‌ కౌన్సిల్‌ లో సభ్యునిగా ఆయన నియమితులయ్యారు. మార్చి 16న ఆయన బ్రిటన్‌ మహారాణి ఆస్థాన న్యాయవాది పదవిని సాల్వే చేపట్టనున్నారు. : భారత్‌కు చెందిన మాజీ సొలిసీటర్‌ జనరల్‌ హరీష్‌ సాల్వే మరో అరుదైన ఘనతను సాధించారు. ఈ నియామకానికి సంబంధించి బ్రిటన్‌ న్యాయశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. న్యాయశాస్త్రంలో అద్భుతమైన ప్రతిభాపాటవాలు కనబర్చిన వారికి మాత్రమే ఈ గౌరవం దక్కుతుంది. ఒక ప్రత్యేక రకమైన సిల్క్‌ వస్త్రాలను ధరించే క్వీన్స్‌ కౌనిల్స్‌ సభ్యులకు టాకింగ్‌ సిల్క్‌ అనడం అక్కడి సంప్రదాయం. ఇక హరీష్‌ సాల్వే నాగపూర్‌ యూనివర్సిటీ నుంచి న్యాయవాద పటా పొందారు. 1992 నుంచి ఆయన ఢిల్లీ హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా ఉన్నారు. 1992-2002 కాలంలో ఆయన భారత సొలిసీటర్‌ జనరల్‌గా వ్యవహరించారు. సాల్వే ప్రస్తుతం బ్లాక్‌స్టోన్‌ ఛాంబర్స్‌ లనే న్యాయసంస్థలో న్యాయవాదిగా ఉన్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post