దిశా హత్య కేసులో మరో కొత్త మలుపు

త్రిసభ్య కమిషన్‌ దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించారు . ఈ కమిటీ వచ్చేవారం రాష్ట్రానికి రానుంది. ఇందులోభాగంగా సైబరాబాద్‌ పోలీసులను, ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృంద (సిట్‌) సభ్యులను, దిశ తల్లిదండ్రులను, అత్యాచార నిందితుల కుటుంబాలను కమిషన్‌ కలవనుంది. ‘దిశ’కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ త్రిసభ్య కమిషన్‌ని వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు దిశ కేసులో వారంరోజుల్లోగా మహబూబ్‌నగర్‌ పోలీసులు న్యాయస్థానానికి ఫైనల్‌ రిపోర్టును సమర్పించనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు జడ్జి సిర్పూర్కర్‌ నేతృత్వం వహిస్తున్న కమిషన్‌లో బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖా ప్రకాశ్, సీబీఐ మాజీ డైరెక్టర్‌ సభ్యులుగా ఉన్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post