ఏపీ , తెలంగాణ లో సంక్రాంతి సెలవులను ఖరారు చేసిన విద్యాశాఖ

ఏపీలో విద్యాశాఖ ఆదేశాల ప్రకారం జనవరి 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి సెలవులుగా ఉన్నాయి. జనవరి 21వ తేదీన పాఠశాలలు మరియు విద్యాసంస్థలు తెరచుకోనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం జనవరి 11వ తేదీ నుండి జనవరి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు కొనసాగనున్నాయి. జూనియర్ కళాశాలలకు కూడా ఇవే సెలవులు వర్తించనున్నాయి. కొన్ని కార్పొరేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవటంలేదని సమాచారం. అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.


తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెల 17వ తేదీన పాఠశాలలు, విద్యాసంస్థలు తెరచుకోనున్నాయి. పలు కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు సాధారణంగా సెలవుల్లో కూడా స్పెషల్ క్లాసుల పేరుతో ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తూ ఉంటాయి. విద్యాశాఖ స్పెషల్ క్లాసుల పేరుతో తరగతులను నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post