సర్దుమనిగిన సరిలేరు, వైకుంఠపురం సినిమాల రిలీజ్ వార్

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ”నాలుగైదు రోజులుగా సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమా విడుదల గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది. అంతకు ముందు జరిగిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ మీటింగ్‌లో సరిలేరు నీకెవ్వరుని జనవరి 11న, అల వైకుంఠపురములో చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయాలని నిర్మాతలతో మాట్లాడి అనౌన్స్ చేశాం. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో జనవరి 10 లేదా 11న అల వైకుంఠపురములో విడుదలవుతుందని వార్తలు వినిపించాయి. దాంతో మరోసారి గిల్డ్ చర్చలు జరిగాయి. నిర్మాతలను కన్విన్స్ చేశాం. పెద్ద సినిమాలు విడుదలవుతున్నప్పుడు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో గిల్డ్ ఇంతకు ముందు చర్చలు జరిపింది. ఆరోజు అనుకున్నట్లే ఇప్పుడు జరిగిన గిల్డ్ చర్చల్లోనూ జనవరి 11న సరిలేరు నీకెవ్వరు.. జనవరి 12న అల వైకుంఠపురములో సినిమాను విడుదల చేయడానికి రెండు సినిమాల నిర్మాతలను ఒప్పించాం. హీరోలతో కూడా మాట్లాడాం. రెండు పెద్ద సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. గత సంక్రాంతికి సక్సెస్‌ఫుల్ మూవీస్ చూశాం. ఈసారి కూడా అన్నీ సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాం.
 సూపర్ స్టార్ మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం జనవరి 11న విడులవుతుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల..వైకుంఠపురములో..’ జనవరి 12న విడుదలవుతుంది. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో గిల్డ్ తరపున నిర్మాతలు దిల్‌రాజు, కె.ఎల్‌.దామోదర్ ప్రసాద్‌, రాజీవ్ రెడ్డి పాల్గొన్నారు.
కె.ఎల్‌. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ”రెండు, మూడు రోజులుగా సంక్రాంతి సినిమాల విడుదలపై చిన్న పాటి సస్పెన్స్ ఉంది. చర్చల అనంతరం సినిమా విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. కారణాలు ఏవైనా కావచ్చు. చివరకి సమస్యకు పరిష్కారం దొరకడమే ముఖ్యం. సమస్యలుంటే చాలా మంది ఇబ్బందులు పడతారు. ఈరోజు జరిగిన మీటింగ్‌లో అందరూ పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యారు” అన్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post