జంగపల్లి టైర్ల ఫ్యాక్టరీని మూసివేయాలని రెండు గ్రామాల ప్రజలు ధర్నా

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గునుకుల కొండాపూర్ జంగపల్లి గ్రామ శివారులలో రబ్బరు టైర్లను కరిగించే పరిశ్రమ ఉంది దాని నుండి వెలువడే పొగ ద్వారా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యాలపాలవడంతో పాటు వ్యవసాయ పంట పొలాలు,గేదెలు మూగజీవాలు కూడా ఈ కాలుష్యానికి గురి అవుతున్నాయని గతంలో జిల్లా కలెక్టర్ మరియు ఆర్డిఒలకు ఫిర్యాదు చేసినా కూడా ఫలితం కనిపించకపోవడంతో గురువారం పరిశ్రమ ఎదుట ప్రజా ప్రతినిధులు సర్పంచులు రెండు గ్రామాల గ్రామస్తులు ఆందోళన చేపట్టారు యజమాని నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో రేపు శనివారం పెద్దఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు తెలిపారు ఈకార్యక్రమంలో సర్పంచ్ అట్టికం శారద శ్రీనివాస్ గౌడ్,ఉప సర్పంచ్ గీకురు లత,కొండాపూర్ టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శంకర్,తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post