నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ సాయం

సామాజిక సేవలో భాగంగా నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు కుర్చీలు, బెంచీలు తదితర సామగ్రి అందజేయాలని పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ నిర్ణయించింది. జైళ్లశాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన ఫర్నిచర్‌ తయారుచేస్తుండటాన్ని గుర్తించిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ శుక్రవారం చంచల్‌గూడ జైలు అధికారులకు రూ.60 లక్షల విలువైన కుర్చీలు, బల్లలకు ఆర్డర్‌ ఇచ్చింది.  
జైళ్లశాఖ ఆధ్వర్యంలో తయారుచేస్తున్న వస్తువులకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నదని ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ తెలిపారు. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఇచ్చిన ఆర్డర్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ బీఎస్‌ రావు, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Previous Post Next Post